27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజలకు స్వచ్ఛమైన కల్లు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అబ్కారి శాఖ సీఐ భాస్కర్ రావు    

 

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో రాంపూర్ రోడ్డు ఈత వనములో వన మహోత్సవ కార్యక్రమం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్,  ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,  ఏపీవో సిబ్బంది  హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బోధన్ సిఐ  మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు కోటగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. గీత కార్మికులు గీత వనాన్ని పెంపకం చేసుకొని రాబోయే రోజుల్లో ప్రజలు స్వచ్ఛమైన కల్లు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విటల్ గౌడ్, కోటగిరి టిసిఎస్ అధ్యక్షులు డి.శంకర్ గౌడ్, గీత కార్మికులు గౌడ సంఘం డి .శ్రీధర్ గౌడ్,ఎం సాయిబాబా గౌడ్, టి.శ్రీనివాస్ గౌడ్,ఏ.శ్రీనివాస్ గౌడ్, ఎం.శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, అర్జున్ గౌడ్, ఎం.నాగ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Provide clean toddy to the people

More articles

Latest article