బతుకమ్మ, పిట్లం : అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయిస్తే అంగవైకల్యాన్ని జయించవచ్చు అని డాక్టర్ సరిత అన్నారు. శుక్రవారం భవిత సెంటర్లో డాక్టర్ సరిత ఆధ్వర్యంలో ఫిజియోథెరపిని నిర్వహించారు. అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు ఫిజియోథెరతో పాటు వ్యాయమం చేయించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా విద్యార్థులను తీసుకువచ్చి భవిత సెంటర్లో ఫిజియోథెరపీ చేయించాలని ఆమె కోరారు. ఆమె వెంట కమల్ కిషోర్, తల్లిదండ్రులు ఉన్నారు.
