27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జి జి హెచ్ ఆవరణలో సేవలు అందిస్తున్న పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని, లెప్రసి ట్రీట్మెంట్ వార్డును బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద్భంగా సిబ్బంది హాజరు, అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న మెడిసిన్స్ పై  ఆరా తీశారు.  ముఖ్యంగా జీవిత చరమాంకంలో చివరి దశలో ఉన్న వయోవృద్ధులకు సరైన సమయంలో, సరియైన ఆదరణతో చికిత్స అందించాలన్నారు. రికార్డులను రిపోర్ట్స్ ను మెయింటైన్ చేయాలని, కుష్టు వ్యాధిగ్రస్తులకు  వివక్ష చూపకుండా చికిత్స అందించాలి అన్నారు.

Provide better services to patients

More articles

Latest article