రోగులకు మెరుగైన సేవలు అందించాలి
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జి జి హెచ్ ఆవరణలో సేవలు అందిస్తున్న పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని, లెప్రసి ట్రీట్మెంట్ వార్డును బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద్భంగా సిబ్బంది హాజరు, అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న మెడిసిన్స్ పై ఆరా తీశారు. ముఖ్యంగా జీవిత చరమాంకంలో...