. . . విద్యుత్ శాఖ ఎస్ ఇ రాజేశ్వర్ రావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాను (యన్ పిడిసిఎల్) కంపెనీ లో ముందు వరుసలో ఉంచడానికి కృషి చేయాలి అని నిజామాబాద్ విద్యుత్ శాఖ( ఆపరేషన్) ఎస్ ఇ రాజేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం పవర్ హౌస్ కాంపౌండ్ లో విద్యుత్ శాఖ అధికారులతో ఎస్ ఈ ఆపరేషన్ నిజామాబాద్ పీవీ రాజేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఇ మాట్లాడుతూ. . . మనమందరం కలిసి పొలం బాట పట్టణ బాట నిర్వహించి వినియోగదారులకు భద్రత గురించి చెప్పాలని సూచించారు .విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని విద్యుత్ నియంత్రికలు పాడవకుండా బాగు చేయాలని సూచించారు లూజ్ లైన్స్ విరిగిపోయిన పోల్స్ బాగు చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాలని రిపీటెడ్ ఫెయిల్ అయిన డిపిఆర్లు ఇన్ఫెక్షన్ చేసి లైన్ లో డిపి బాగు చేయాలని సూచించారు. 33 కెవి ,11 కేవీ అంతరాయం తగ్గించాలని చెప్పారు. ఈ సమావేశంలో డి ఈ టెక్నికల్ రమేష్, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, డీ ఈ లు ఎం శ్రీనివాస్, ఎండి ముక్తార్ ,డి వెంకట్ రమణ, హరిచంద్ర ,రఘు, సమీక్షా సమావేశంలో ఏడి ఈ లు, ఏఈలు ఏ ఏ ఓ లు హాజరయ్యారు.

