29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామంలో సోమవారం జర్నలిస్టు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆర్మూర్, బాల్కొండ, జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలిస్టులు జాతీయ రహదారిపై రాస్తారో నిర్వహించి బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కు అనంతరం సీఐకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులు భార్య పిల్లలను వదిలి రాత్రి పగలు ప్రజల సమస్యలపై పోరాడుతూ ,ప్రజలకు నిజమైన సమాచారాన్ని చేరవేయడం తమ కర్తవ్యమని,కానీ జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.తాళ్ళ రాంపూర్ ఘటనలో దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి,కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజల హక్కులపై, ప్రజా స్వామ్యం  పై దాడిగా భావించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం,పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకు మైపాల్, నిజామాబాద్ జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న, బీసీ,ఎస్సీ,ఎస్టీ  జేఏసీ, రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గాల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Protests against attacks on journalists

More articles

Latest article