జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు
మోర్తాడ్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామంలో సోమవారం జర్నలిస్టు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆర్మూర్, బాల్కొండ, జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలిస్టులు జాతీయ రహదారిపై రాస్తారో నిర్వహించి బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కు అనంతరం సీఐకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులు భార్య పిల్లలను వదిలి రాత్రి పగలు ప్రజల సమస్యలపై పోరాడుతూ ,ప్రజలకు నిజమైన సమాచారాన్ని చేరవేయడం తమ కర్తవ్యమని,కానీ జర్నలిస్టులపై దాడులు జరగడం...