నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు రమేష్ బిదౌరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొయినుద్దీన్,కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, సేవాదళ్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ , నవాజ్ మాట్లాడారు. బిజెపి నాయకులకు స్త్రీల పట్ల వారికి ఉన్న కుసంస్కారాన్ని మరోసారి బట్టబయలైందని అన్నారు. చేసిందని బిజెపి పార్టీ అంటేనే హత్యలు, మానభంగాలు, దోపిడీలు చేసేవారని అన్నారు. వారు దేశం గురించి ధర్మం గురించి మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. రమేష్ బిదౌరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం ఖండిస్తుందని తెలిపారు. తక్షణమే బిజెపి పార్టీ హై కమాండ్ రమేష్ బీదౌరి ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని. అలాగే బిజెపి పార్టీ అగ్ర నాయకులు రమేష్ బీదౌరి చేసిన వ్యాఖ్యలకు సంపూర్ణ బాధ్యత వహించి ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు రషీద్, పవన్ కాక , అక్రమ్, సాయికిరణ్, శివ, రేవంత్,ముదస్సిర్, అతీఫ్, మినాజ్, పాల్గొన్నారు.
