తెయూ రిజిస్ట్రార్ ను కలిసిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు

0 1,184

నిజామాబాద్, బతుకమ్మ : గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్పులు రాకపోవడంతో డిగ్రీ ,పీజీ కళాశాలలను గత రెండు రోజుల నుండి బంద్ పెట్టడం జరిగింది. కళాశాలలు బంద్ పెట్టడానికి గల కారణాలను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి,ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్ర శేఖర్ ని కలిసి వివరించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్,కో ఆర్డినేటర్ నరాల సుధాకర్ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకపోవడంతో ఉద్యోగులకు గత కొన్ని నెలల నుండి జీతభత్యాలు ఇవ్వలేక పోతున్నామని తెలిపారు. ప్రభుత్వానికి తమ ఇబ్బందులను తెలుపాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ రాజు, సూర్యప్రకాశ్,సుజన్,అరుణ్ కుమార్,రాజు,శ్రీనివాస్,అతీఖ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.