నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ద్వారకనగర్‌లో ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నగర అధ్యక్షురాలు లక్ష్మి, నగర కార్యదర్శి సంజన మాట్లాడుతూ కామ్రేడ్ నాగన్న జీవితం ప్రజా ఉద్యమాలకు, విప్లవ సాంస్కృతిక రంగానికి అంకితమైనదని కొనియాడారు. ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, అరుణోదయ సంస్థను సమైక్య సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దడంలో కామ్రేడ్ నాగన్న చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నగర నాయకులు సురేఖ, రేఖ తదితరులు పాల్గొన్నారు.

