- అధికారులకు సహకార బ్యాంకు డిడిఎం ప్రవీణ్ ఆదేశం
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామ సహకార సంఘం నందు 2025 అంతర్జాతీయ సహకార వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సహకార బ్యాంకు డిడిఎం ప్రవీణ్ మాట్లాడుతూ దేశ సుస్థిర అభివృద్ధిలో సహకార సంస్థల పాత్ర కీలకమని, సహకార సంఘాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పుల్కల్ సహకార సంఘం శుక్రవారం జరిగిన సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం ప్రకటించిందన్నారు. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సహకార వ్యవస్థ స్థిరమైన జీవనోపాధి సృష్టించుటకు వారి ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకార వ్యవస్థను గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు ర్యాలీలు, సమావేశాలు, మారథాన్ లు నిర్వహించాలన్నారు. గ్రామంలో 2025 సంవత్సరంలో నెలల వారీగా చేయవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ప్రణాళిక ననుసరించి కార్యక్రమాలు నిర్వహించాలని డిడిఎం సహకార శాఖాధికారులను ఆదేశించారు. సహకార వ్యవస్థ ద్వారా సమాజాభివృద్ధిపై పాఠశాల స్థాయి నుండి అవగాహన కలిగించేందుకు విద్యార్థులకు వ్యాసరచన, వ్రకృత్త్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల సర్వసభ్య సమావేశాలలో ద్వారా వ్యవసాయ రంగం, ఇతర రంగాలకు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సహకారరంగాన్ని ఉన్నతమైన వ్యవస్థగా రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగంలో తీసుకున్న సంస్కరణల గురించి చేస్తున్న కార్యక్రమాలను వివరించాలన్నారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, నిర్వహించాలని, సహకార రంగ అభివృద్ధిలో మహిళా పొదుపు సంఘాల పాత్ర గురించి తెలియజేయాలన్నారూ సహకార రంగాలలో సుపరిపాలనకు తీసుకోవలసిన చర్యలు గురించి సహకార సంఘాల సభ్యులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

జులై,5వ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, మారథాన్ లు నిర్వహించాలన్నారు.కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహకార వ్యవస్థ, దేశ అభివృద్ధిలో పాత్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సాగు రైతులు, ఉద్యానవన రైతులు , మత్స్యకారులకు వారి పంట సీజన్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలు నిర్వహించి రైతుల సేవలో సహకార మార్కెటింగ్ సొసైటీ పాత్ర అనే అంశాన్నితెలియజేయాలని, వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహకార రంగంలో అర్బన్ బ్యాంకులు సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఉద్యోగులు సహకార పరపతి సంఘాలు, తదితర పరపతి సెమినార్లు నిర్వహించాలని డిడిఎం ప్రవీణ్ సహకార శాఖాధికారులను ఆదేశించర్రు. సహకార సంఘాల సక్రమ నిర్వహణ నిమిత్తం అందుకు తగిన విధంగా వాటిలో జరిగే సభ్యత్వం, డిపాజిట్లు, రుణాలు, పెట్టుబడులు, తదితర లావాదేవీలు అన్నీ నిర్దేశించిన సమయంలో కంప్యూటరీకరణ చేయాలన్నారు. సహకార వ్యవస్థ ద్వారా జరిగే సమాజాభివృద్ధిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడంతోపాటు సహకార రంగాన్ని జిల్లాలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డీడియం ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం శ్రీధర్, పుల్కల్ సొసైటీ చైర్మన్ భీమ్రావు దేశాయ్, పుల్కల్ సొసైటీ సెక్రటరీ సాయి చరణ్, మరియు సొసైటీ డైరెక్టర్లు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.

