27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రొఫెసర్ బి.బాలమణి పరిశోధన గ్రంథం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్, బి.బాల మణి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆచార్య బి సునీల్ కుమార్ పర్యవేక్షణలో ” కళాశాల స్థాయి వాలీబాల్ క్రీడాకారులలో మోటార్ ఫిట్‌నెస్ అభివృద్ధిపై ఎంపిక చేసిన శిక్షణా పద్ధతుల ప్రభావం” అనే అంశంపై రాసిన పరిశోధన గ్రంథాన్ని గురువారం కళాశాల ప్రిన్సిపల్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. రంగరత్నం ఆవిష్కరించారు.

 

Professor B. Balamani's research book launched

 

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్ బాలమణి అందిస్తున్న సేవలను, పరిశోధనలోనూ కృషి చేయడం, గొప్ప విశేషమని అభినందించారు. గ్రంథకర్త బి.బాలమణి మాట్లాడుతూ నా అభివృద్ధిలో జి.జి. కళాశాల ముఖ్యమైన పాత్ర కలిగి ఉందనీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, డా.దండుస్వామి, డా.రంజిత, డా.రామస్వామి,  డా.రాజేష్, మోబిన్, నాగజ్యోతి, తబస్సుం, శ్రీలేఖ, లావణ్య, ఏఓ రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ్ భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Professor B. Balamani's research book launched

More articles

Latest article