హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక సోదరీమణులు, తెలంగాణ జన సమితి మహిళా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు ప్రొ.కోదండరాంకి రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు ప్రొ.కోదండరాం ప్రేమతో చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలను మరింత పెంచే పండుగ రక్షాబంధన్ అని అన్నారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విధంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆశప్ప, వినయ్, టి.జె.ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, కార్యాలయ ఇన్‌చార్జి హనుమంతరెడ్డి, జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజు, నగర ఉపాధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కోశాధికారి సురేష్, సనత్‌నగర్ ఇన్‌చార్జి రమేష్, జూబ్లీహిల్స్ ఇన్‌చార్జి హనుమంత్ గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ సయ్యద్ ఇస్మాయిల్, జన సమితి నాయకులు సదానంద్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, అంజి, వెంకటేష్, విద్యార్థి జన సమితి నగర అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
