కార్మిక సోదరీమణులతో ప్రొ.కోదండరాం ఆత్మీయ రక్షాబంధన్ వేడుకలు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక సోదరీమణులు, తెలంగాణ జన సమితి మహిళా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు ప్రొ.కోదండరాంకి రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు ప్రొ.కోదండరాం ప్రేమతో చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల...