ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువకులకు క్రీడా పోటీలను నిర్వహించారు. సోమవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలలో గెలుపొందిన యువకులకు అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశం చిన్న నర్సయ్య, ఉపాధ్యక్షులు జెగ్గ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, సంయుక్త కార్యదర్శి పాశం ప్రవీణ్, కోశాధికారి కేపీ గంగారం, ఆటల కార్యదర్శి పూజాం వీరయ్య, సదర్ పెద్దమనిషి అంజయ్య, సంఘ సభ్యులు, తుమ్మల చంటి, యు పెద్ద గంగారం, ఎస్ నరసయ్య, టి సాయిబాబా, ప్రవీణ్ డీలర్, కే నడిపి సాయిలు, ఎస్ నవీన్, కే గంగారాజ్యం, మాజీ అధ్యక్షులు నరేష్, కే గంగారాం, గట్టు కడారి, మాజీ అధ్యక్షులు జెగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.
