32.2 C
Hyderabad

కాంగ్రెస్‌లో చేరిన జంగిలోడి తండా సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

. . . కండువా కప్పి ఆహ్వనించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

సిరికొండ మండలం జంగిలోడి తండా గ్రామాల సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్ పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో సర్పంచ్ గంగాధర్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన గంగాధర్ తో పాటు వారి వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article