29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ ను శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కలిసి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత  రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయనను కోరారు. దీనికి   మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంబోజి హరిప్రసాద్, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, సుజన్ రెడ్డి,  మిగతా యాజమాన్య  ప్రతినిధులు పాల్గొన్నారు.

Private College Management Association met PCC President

More articles

Latest article