30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఇష్టారాజ్యంగ దందా

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోణ
  • పట్టించుకోని ఆసుపత్రి అధికారులు

 

బాన్సువాడ, బతుకమ్మ : ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం,వర్గ పోరు పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ప్రజల ప్రాణాలకన్నా తమ లాభాపెర్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఘటనలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం వారు పెషేంట్లను తీసుకువెళుతుంటే మరొక వర్గం అంబులెన్స్ ను ఆపి గొడవపడి విలువైన వైద్య సమయాన్ని వృధాచేయడంతో పెషేంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్సు నిర్వాహకుల మధ్య వర్గపోరుతో పేషెంట్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అత్యవసర సమయంలో పెషేంట్ లను ఆదుకోవలసిన అంబులెన్సులు గొడవలు పడుతూ పెషేంట్ల ప్రాణాల మీదికి తీసుకొస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రులలో ప్రాణాపాయ స్థితికి వస్తే వారిని మెరుగైన చికిత్స కోసం తరలించేందుకు నిత్యం అంబులెన్సులను వినియోగిస్తారు. అంబులెన్స్ లకు రిజిస్ట్రేషన్ పత్రాలు,ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పెషేంట్లను ఆసుపత్రులకు తరలిస్తు పెషేంట్ బంధువుల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బుల వసూళ్లకు పాలుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.అంబులెన్సులో కనీస సౌకర్యాలు లేకుండా వాహనాలు నడుపుతున్న తీరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని అంటున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా వాహనాలను నడుపుతున్నారని,ఫార్మ్ 22 ప్రకారం రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు నడపాలి.కానీ, అవేమి పాటించకుండా ఇష్టానూసారంగా వ్యవహారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ,వైద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

More articles

Latest article