నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఈనెల 22, 23తేదీల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా జిల్లాలో పర్యటించనున్నట్లు డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఈ రెండురోజులలో సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుని వద్ద పాఠ్యప్రణాళికలు, డైరీలు ఉండాలని సూచించారు. టైంటేబుల్, పాఠశాల నిర్వహణా కమిటిలు, వివిధ కమిటీలు ప్రదర్శించాలని అన్నారు. లైబ్రరీల నిర్వహణ లైబ్రరీ గదులు వాటికే వినియోగించాలని తెలిపారు. ఎఫ్.ఎల్.ఎన్ డేటా పూర్తిస్థాయిలో ఎంటర్ చేసి రికార్డులు మీ వద్ద ఉంచుకోవాలి. టీచర్ ట్రైనింగ్ లో చెప్పిన విధంగా పాఠ్యాంశ బోధన జరగాలి. బడిబాట వివరాలను ఎన్రోల్ మెంట్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. గత సంవత్సరం బడిబాట ఎన్రోల్ మెంటు అందుబాటులో ఉంచాలి. బడిబాటకు సంబంధించిన డాక్యుమెంటును ప్రదర్శించాలి. మధ్యాహ్నభోజన రికార్డులు,వివరాలుఉన్నతీకరించి అందుబాటులో ఉంచాలి. పాఠశాలలో జరిగిన విశేషాలను డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించగలగాలి. గతసంవత్సరం విద్యార్ధులకు ప్రత్యేకంగా వినియోగించిన నోట్ బుక్స్ ని ప్రదర్శించేందుకు అందుబాటులో ఉంచాలి. సైన్స్ ల్యాబ్ లో చేసిన యాక్టివిటీ వివరాలు అందుబాటులో ఉండాలి. ల్యాబ్ లు నీట్ గా ఉండాలి. టెక్ట్స్ బుక్స్, యూనిఫాం, డాటాను ఆన్ లైన్ 100 శాతం పూర్తి చేయాలి. పెరిగిన ఎన్ రోల్ మెంటు ప్రకారం పాఠ్యపుస్తకాలు లేకపోతే తగ్గినవారికి పాత పుస్తకాలు అందించాలి. యుడైస్ డాటా 100 శాతం పూర్త చేయాలి. ఉపాధ్యయులంతా పాజిటివ్ దృక్పధంతో ఉండి విద్యార్ధులు వారి సామర్ధ్యాలను కార్యదర్శిగారు ముందు ప్రదర్శించగలిగేలా తర్ఫీదునివ్వాలి. భవిత కేంద్రాలను, యం.ఆర్,సిలను సందర్శిస్తారు గనుక ఐ.ఇ.ర్.పిలు, యం.ఆర్.సి స్టాప్ సిద్ధంగా ఉండాలి. సి.ఆర్.పిలు కాంప్లెక్సు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గారి పర్యటనను విజయవంతం అయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
