22నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా జిల్లాలో పర్యటన
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఈనెల 22, 23తేదీల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా జిల్లాలో పర్యటించనున్నట్లు డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఈ రెండురోజులలో సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుని వద్ద పాఠ్యప్రణాళికలు, డైరీలు ఉండాలని సూచించారు. టైంటేబుల్, పాఠశాల నిర్వహణా కమిటిలు, వివిధ కమిటీలు ప్రదర్శించాలని అన్నారు. లైబ్రరీల నిర్వహణ లైబ్రరీ గదులు వాటికే వినియోగించాలని తెలిపారు. ఎఫ్.ఎల్.ఎన్ డేటా పూర్తిస్థాయిలో ఎంటర్ చేసి రికార్డులు మీ వద్ద ఉంచుకోవాలి. టీచర్ ట్రైనింగ్ లో చెప్పిన...