27.3 C
Hyderabad
Friday, July 31, 2026

అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • 2 కోట్ల సంఘాన్ని 100 కోట్లుకు అభివృద్ధి చేశా
  • వారి హయాంలోనే 10కోట్ల అవినీతి
  • మాజీ చైర్మన్ సోమశేఖర్ రావు
  • సంఘం ఆస్తులు వేలం వేస్తె ఊరుకోం : సంఘం సభ్యులు

 

కోటగిరి, బతుకమ్మ : తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని ఎత్తోండ సహకార సంఘం మాజీ చైర్మన్ సోమశేఖర్ రావు అన్నారు. ఎత్తోండ గ్రామంలోని ఆయన నివాసంలో సంఘం సభ్యులతో కలసి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   శనివారం మాజీ చైర్మన్ అశోక్ పటేల్ కొందరు డైరెక్టర్లు కలిసి గణపయ్య సత్త ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 23 సంవత్సరాలుగా చైర్మన్ గా కొనసాగినప్పుడు సంఘం ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్రంలోని నెంబర్ వన్ గా నిలిచింది అని అన్నారు. 1995లో 2కోట్ల టార్నోవర్ నుండి 100 కోట్ల అభివృద్ధి చేశామని సంఘానికి 10 ఎకరాల భూమితో పాటు పార బాయిల్డ్ రైస్ మిల్లు, రా రైస్ మిల్లు, సీడ్ ప్రోసెసింగ్ ప్లాంట్, కిరాణా షాప్, టెంట్ హౌస్, హైదరాబాద్, బోధన్లో బియ్యం షాపులు, నాలుగు గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు, తొమ్మిది గ్రామాలలో ఎరువుల దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేశామని అన్నారు. సంఘాని అభివృద్ధి చేయడం కోసం తాను కష్టపడుతూ సిబ్బంది సైతం కష్టపడ్డానని తెలిపారు. నా హయాంలో సంఘం 7 కోట్ల రూపాయలు అప్పులలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2017-18 నాటికీ 5,47,53,081 రూపాయలు బ్యాంకులకు ఎరువులకు కాంపెనీలకు బాకీ ఉండగా ముగింపు నిలువలు 3,40,37,791 రూపాయలు ఉన్నాయని తెలిపారు. దీనితో పాటు  సిఎంఆర్ రైస్ సివిల్ సప్లై కు పూర్తిగా చెల్లించినప్పటికీ సంఘానికి సంబందించిన 74 లక్షల రూపాయల ధాన్యం నిలువ ఉందని ఆయన తెలిపారు. 2020 లో నూతన పాలక వర్గం బాధ్యతలు తీసుకున్న వాటి నుంచి ఐదు ఏళ్లలో సీఎంఆర్ ప్యాడి, 8 కోట్ల 70 లక్షలతో పాటు క్యాష్ క్రెడిట్ కోటి నలభై లక్షలు  రూపాయలు అవినీతి చేసి తప్పించుకోవడం కోసం తనపై బురద జల్లుతున్నారని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సంఘం ఆస్తులకు వేలం వేస్తె ఊరుకోం..

డిసిసిబి బ్యాంక్ నుండి తీసుకున్న కోటి నలభై లక్షలు క్యాష్ క్రెడిట్ లోను  చెల్లించని యడల ఆస్తులను వేలం వేస్తాం అని వచ్చిన నోటీసుల పై సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొమారు విచారణ జరిపి అవినీతి పాల్పడిన వారిని గుర్తించి సొమ్ము ను రికవరీ చేయాలే కానీ సంఘం ఆస్తులను వేలం సహించేది లేదని తేల్చి చెప్పారు. గతంలో అవినీతి పాల్పడిన వారి భూమి అమ్మి  చెలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్ దేశాయ్, గంగులు, బర్ల హన్మంతు, సంజీవ్, అరుణ్ కుమార్, రత్నాకర్, ప్రసాద్ రావు, సూరి బాబు, చందు, నారాయణ, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article