. . . మెడికల్ ఆఫీసర్ డా.రక్షిత
ఏర్గట్ల, బతుకమ్మ :
వర్షాకాలంలో ప్రబలే మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డా.రక్షిత తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం మంగళవారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విద్యార్థినులకు జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి తదితర అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డా.రక్షిత మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా అలాగే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతను వివరించి, దానిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సంధ్య, హెచ్‌ఈఓ మోతిరం, హెచ్‌ఎస్ విజయ, హెల్త్ అసిస్టెంట్ పండరి, ఏఎన్‌ఎంలు త్రివేణి, కల్పన, స్వప్న, ఆశా కార్యకర్తలు భారతి, నవ్య, సులోచన, కేజీబీవీ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
