24 C
Hyderabad
Sunday, August 2, 2026

ముందస్తు అక్రమ అరెస్టులు సిగ్గుచేటు

Must read

📰 Generate e-Paper Clip

సిరికొండ, బతుకమ్మ :  గవర్నర్ పర్యటన సందర్భంగా ముందస్తు అక్రమ అరెస్టులకు పూనుకోవడం సిగ్గుచేటు అని  విప్లవ ప్రజాసంఘాలు సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి.ఈ సంఘటనను అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏ.ఐ.కే.ఎస్ ) జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్, ప్రగతిశీల మహిళా సంఘం(పి.ఓ.డబ్ల్యు) జిల్లా అధ్యక్షురాలు పి. రమ, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏ.ఐ.పి. కే. ఎం. ఎస్.) జిల్లా కోశాధికారి ఎస్. కిశోర్, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ ) మండల నాయకులు ఎస్. ఆశన్న తదితర ప్రజా విప్లవ సంఘాల నాయకులు ఖండించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్       బుధవారం  తెలంగాణ యూనివర్శిటి పర్యటన నేపథ్యంలో సిరికొండ మండలంలోని సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ నాయకులను అరెస్ట్ చేయడం శోచనీయం అన్నారు.  సిపిఐ(ఎం.ఎల్)మాస్.లైన్ జిల్లానాయకులు ఆర్.రమేష్ ,    ట్రేడ్.యూనియన్.సెంటర్.అప్ ఇండియా(TUCU) నిజామాబాధ్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ఎం. అనిస్లతో పాటు AIKMS మండల నాయకులు మార్క్స్ లను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలనా అందిస్తాను అని నియంతృత్వం, లాఠీల పాలనా సాగిస్తున్నారని వారు ఆరోపించారు. నియంతృత్వ పాలనను వదిలి ప్రజాస్వామిక పాలనా అందించాలి అని వారు డిమాండ్ చేశారు. నియంతృత్వ పాలనకు ప్రజలే బుద్దిచెప్పుతారని వారు హెచ్చరించారు.

Pre-emptive illegal arrests are shameful1452

More articles

Latest article