30.9 C
Hyderabad
Monday, August 3, 2026

గిరిజన విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి నివాసం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాదవ్ ప్రవీణ్ నాయక్ (గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు), జివిఎస్ పట్టణ అధ్యక్షుడు బాధవత్ శ్రీనివాస్ నాయక్, డేగవత్ దూప్ సింగ్ నాయక్‌లను బోధన్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. లంబాడా కులాన్ని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా శాఖ ఉద్యమం చేపడుతున్న సందర్భంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్రా బంతి నాయక్‌తోపాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, లంబాడిల రిజర్వేషన్ హక్కులను కాపాడే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. “జై సేవాలాల్, జై భవాని, జై బంజారా” నినాదాలతో ఉద్యమం తీవ్రతరం అవుతుందని తెలిపారు.

More articles

Latest article