గిరిజన విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్
బతుకమ్మ, బోధన్ : తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి నివాసం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాదవ్ ప్రవీణ్ నాయక్ (గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు), జివిఎస్ పట్టణ అధ్యక్షుడు బాధవత్ శ్రీనివాస్ నాయక్, డేగవత్ దూప్ సింగ్ నాయక్‌లను బోధన్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. లంబాడా కులాన్ని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా...