24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్  జిల్లాలో ముగ్గురు సీఐలకు పోస్టింగ్ లు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న ముగురు సీఐలకు నిజామాబాద్ జిల్లాలో  పోస్టింగ్ లు ఇస్తు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 ఐజి వద్ద పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మండల అశోక్ కు  ఖాళీగా నిజామాబాద్ ఎన్ఐబిలో ఇన్స్ పెక్టర్ గా నియమించారు. నిజామాబాద్ వీఆర్ లో ఉన్న చింతల తాడేం శ్రీనివాస్ కు నిజామాబాద్ రూరల్ పిఎస్ కు అటాచ్డ్ ఉత్తర్వులు ఇచ్చారు. నిజామాబాద్ సిసిఆర్ బిలో పనిచేస్తున్న సాదుల సతీష్ కుమార్ కు నిజామాబాద్ నాల్గవ టౌన్ కు అటాచ్డ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు.

  • రెండు ఠాణాల అప్ గ్రేడేషన్..

నిజామాబాద్ జిల్లాలో రెండు ఠాణాల అప్ గ్రేడేషన్ ను కు వేళయింది. జిల్లాలో ఎన్నాళ్లుగానో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్  నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ లకు సీఐల నియామాకం కోసం అధికారులు ఇదివరకు ప్రతిపాదనలు చేశారు. అవి కార్యరూపం దాల్చనున్నాయి.  సోమవారం ఇద్దరు సీఐలకు అటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇవ్వాలో రేపో ఈ మేరకు ఠాణాల అప్ గ్రేడేషన్ ఉత్తర్వులు రావడం ఖాయమైంది. రెండు ఠాణాల పరిధి పెద్దదిగా ఉండటంతో అక్కడ ఇన్స్ పెక్టర్ లకు ఎస్ హెచ్ ఓలుగా నియామకం జరుగనుంది. సిఐల ఆధ్వర్యంలోకి రెండు ఠాణాలు వెళ్లనుండటంతో నిజామాబాద్ నగర సర్కిల్ పరిధికి 2,3 పోలీస్ స్టేషన్ లు, నిజామాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలోకి  మెపాల్, ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉండనున్నాయి. ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో శాంతి భధ్రతల పర్యవేక్షణ సులువు కానుంది.

More articles

Latest article