- నగర మేయర్ నీతూ కిరణ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళల ప్రజా ప్రతినిధి పై మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయటం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. సామజిక మాద్యవాల ద్వారా ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫోటోలను @అరవింద్దర్మపురిఆర్మీ అనే ఐడి తో పోస్ట్ పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే సామజిక మధ్యమాల నుండి ఆ పోస్టులను తొలగించాలని ఇంచార్జి కమిషనర్ అఫ్ పోలీస్ సింధు శర్మను మంగళవారం కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ధర్మపురి అనుచరులు విచ్చలవిడిగా కనీసం మహిళల ప్రజా ప్రతినిధి అనే గౌరవం లేకుండా మార్ఫింగ్ ఫోటో తో కించపరచటం సిగ్గు చేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
