28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రికెట్ క్రీడాకారునికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొత్తబాది కేపీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ లో 56 జట్లు పాల్గొనగా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన షేక్ కాజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ , మెన్ అఫ్ ది సిరీస్,  బెస్ట్ బ్యాట్ మాన్ గా అవార్డు పొందిన సందర్భంగా మండల హెడ్ క్వార్టర్ లో మండల వాసులు ఘనంగా సన్మానించారు. మండల బీఆర్ఎస్ పార్టీ ఉపధ్యక్షుడు శెట్టి బిరిష్ మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తిని తీసుకొని క్రీడా రంగాలలో రాణించాలన్నారు. రాబోవు కాలంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి లలో రాణించి ఇందల్వాయి మండలానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిర్మన్ పల్లి మాజీ ఎంపీటీసీ చింతల దాసు, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు శెట్టిబిరీష్, సిర్నాపల్లి మాజీ ఎంపీటీసీ కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ముచ్చ గోపాల్, శాలివాహన సంఘం మండల అధ్యక్షుడు కుమ్మరి శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ బొక్క గంగాధర్ మరియు మైనారిటీ యువత పాల్గొన్నారు.

More articles

Latest article