- మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
మోర్తాడ్, బతుకమ్మ : మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం జీయస్టీని తగ్గించడం మూలన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల లబ్ది చేకూరనుందని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ శివనాంద్ రెడ్డి అన్నారు. జిఎస్స్టీ ని తగ్గించి పేదలను ఆదుకున్నందుకు పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం ప్రధాని మోడీజి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ జీయస్టీ తగ్గించడం మూలన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యార్థులకు స్టేషనరీ ధరలు, వ్యవసాయదారులకు, ఆటోమొబైల్ రంగం తో పాటు మెడిసిన్ కుడా చౌకగా దొరకానున్నాయని అన్నారు. వీటితో పాటు ఇన్సూరెన్సు రంగం లో హెల్త్ ఇన్సూరెన్స్ కు అనుకూలంగా ఉండనుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగం అనిల్, మండల ప్రధాన కార్యదర్శి అలిశెట్టి శ్రీకాంత్, మాజీ మండలాధ్యక్షుడు పుప్పాల నరేష్, ఉపాధ్యక్షులు సంతోష్, బోబిడే మోహన్, భావాల నర్సయ్య,చిన్నరెడ్డి,అశోక్,గంగారేడ్డి, కిసాన్ మోర్చా జిల్లా సభ్యులు ఏలేటి సాయన్న,శక్తి కేంద్ర ఇంచార్జ్ లు లక్ష్మి నర్సయ్య,మండలకిసాన్ మోర్చా అధ్యక్షులు గంగారెడ్డి, మండలఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రకాష్, సంపత్,సవీన్,ప్రవీణ్, నవీన్ , సాగర్, శేఖర్,నర్సయ్య, బాలరాజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
