. . . ధర్పల్లి సర్కిల్ కార్యాలయంను తనిఖీ చేసిన పోలిస్ కమీషనర్
ధర్పల్లి, బతుకమ్మ :
అధికారులు ,సిబ్బంది 24 గంటలు తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ఇతరులకు అధర్శంగా ఉండాలని నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నిజామాబాద్ ఏసిపి రాజా వేంకట్ రెడ్డి, ధర్పల్లి ఇన్స్పెక్టర్ బిక్షపతి, ధర్పల్లి ఎస్సై ఎం. కళ్యాణి , సిరికొండ ఎస్సైల జె. రామకృష్ణ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు.

ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి , అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు.ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిపి సాయి చైతన్య సూచనలు చేశారు.

