23.1 C
Hyderabad

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Police raid on a gambling den

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరుగురు అరెస్టు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని 3వ  టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బా అరుంధతి నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు 3వ టౌన్ పోలీసు సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,100 నగదు, 6 మొబైల్ ఫోన్లు,2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

More articles

Latest article