25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నలుగురు అరెస్ట్, రూ.12760 స్వాధీనం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల పరిదిలోని గన్నారం గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన పోలీసుల ఆకస్మిక దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12760 స్వాధీనం చేసుకున్నట్లు ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలత తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో ఎక్కడైనా పేకాట నిర్వహించినా లేదా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం లేదా వాటికి బానిసలై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై భుక్య సుమలత కోరారు.

More articles

Latest article