29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నగరంలో పోలీసుల ఆపరేషన్ టప్ప చబుత్తార్

Must read

📰 Generate e-Paper Clip

50 మంది పోలీసుల తనిఖీలు

యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నగరంలో పోలీసులు ఆపరేషన్ టప్ప చబుత్తార్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఐదో టౌన్ పరిధిలోని జిల్లా రోడ్డు శాంతినగర్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, మాక్లూర్ ఎస్సైల ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సంచరిస్తున్న యువకులను   హెచ్చరించారు. 20 మంది యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్టేషన్ కు తరలించారు. పాత నేరస్తుల కదలికలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఆపరేషన్ టప్ప చబుత్తార్  నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Police operation Tappa Chabuttar in the city

More articles

Latest article