29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీచక్ర హాస్పిటల్ కు పోలీసుల నోటీసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల శ్రీ చక్ర హాస్పిటల్ కు నోటీసులు జారీ చేసినట్టు రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ సయ్యద్ ముజాహీద్ తెలిపారు. శివాజీ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన దాసరి కిషన్, దాసరి నాగమణి, దాసరి వంశీలు గడ్డిమందు తాగీ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురికి ఖలీల్ వాడిలోని శ్రీ చక్ర హస్పీటల్ లో చికిత్స అందించారు వైద్యులు. అందులో కిషన్ బుధవారం తెల్లవారు జామున చికిత్స పొందుతు మృతి చెందాడు. ఇట్టి సంఘటన లో శ్రీ చక్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ ముగ్గురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినా విషయం, మృతుడు చనిపోయిన విషయం గురించి ఎటువంటి సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. దాసరి కిషన్ మృతదేహంను ( పోస్టు మార్టం)శవ పరీక్ష లేకుండా కుటుంబీకులకు అప్పగించటం మెడికో లీగల్ కేసుకు  సంబందించిన నిబంధనల ప్రకారం వ్యవహరించక పోవటం జరిగింది. ఇట్టి విషయంలో శ్రీ చక్ర హాస్పిటల్ యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు  నోటీసులు జారీ చేసి చట్ట పరంగా నిబంధనల ప్రకారం తగు చర్యలు తీనుకోవటం జరుగుతుందని తెలిపారు.

More articles

Latest article