వెబ్ డెస్క్, బతుకమ్మ :
పోలీస్ స్టేషన్ లో పోలీసుల తుపాకులు చోరికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంప్యూటర్ వర్క్ కోసం వచ్చిన యువకుడు ఆర్మ్ స్టోర్ లోని తుపాకులను ఎత్తుకెళ్లాడు. ఇటీవల పోలీస్ స్టేషన్ లో వర్క్ ఉందని ఐటిఐ పూర్తి చేసిన యువకుడిని స్టేషన్ కు రప్పించి వర్క్ చేయించారు పోలీసులు. తీరా వర్క్ ముగిసిన తర్వాత స్టేషన్ లో ఉండాల్సిన తుపాకులు లేకపోవడంతో అనుమానం పై కంప్యూటర్ వర్క్ చేసేందుకు వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే తుపాకులను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి తుపాకులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.
