32.2 C
Hyderabad

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన..

 బతుకమ్మ బోధన్:  బోధన్ మండలంలో శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోపర్గా గ్రామం వద్ద.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఈ టిప్పర్లను అనుమానాస్పదంగా గుర్తించి స్టేషన్ కు తరలించారు. ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. టిప్పర్లు కు ఎటువంటి అనుమతులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల అప్రమత్తతతో అక్రమ రవాణాకు మరోసారి అడ్డుకట్ట పడింది.

More articles

Latest article