27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ట్రావెల్ బస్ లో బ్యాగు చోరీ కేసును చేధించిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ అరెస్ట్

వివరాలు వెల్లండించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయివేట్ ట్రావెల్ బస్ లో బ్యాగు నుంచి రూ.25 లక్షల చోరీ కేసును పోలీసులు చేధించారు. ధార్ గ్యాంగ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ ఈచోరీకి పాల్పడడ్డాని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. అంతర్ ర్రాష్ట్ర దొంగల ముఠా థార్ గ్యాంగ్ కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్ ని ఈకేసులో అరెస్టు చేశారు. చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు అష్రఫ్ వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మొత్తం విలువ రూ. 35,00000) .మధ్య ప్రదేశ్లోని మన్వర్ తాలుకా రాళ్లమండల్ గ్రామానికి చెందిన వ్యక్తి మహమ్మద్ అష్రఫ్ ఖాన్. ఇతడిపై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల  కేసులు నమోదై ఉన్నాయి. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. డీఎస్పీ శివరాం రెడ్డి  ఆధ్వర్యంలో కేసును చేధించిన సీసీయస్ సీఐ జితేందర్ రెడ్డి, నార్కట్ పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐలు క్రాంతి కుమార్, కానిస్టేబుల్స్  లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ రివార్డ్ లు ప్రకటించారు.

More articles

Latest article