24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యోగులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులతో పాటు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. డి.ఐ.జి జోన్ 2 క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్కూల్ విధ్యార్థులకు, పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్స్ అందజేశారు.

 

Police Commissioner unfurls the national flag

Police Commissioner unfurls the national flag

More articles

Latest article