నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఒక ముసలావిడ మెళ్లో నుంచి చైన్ లాక్కొని పారి పోయిన ఒక ఆటో డ్రైవర్ ని 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మూడవ టౌన్ ఎస్ హెచ్ఓ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం మే 20 న ఉదయం 11 గంటలకు 70 సంవత్సరాల ముసలావిడ శుభ కార్యానికి వెళదామని కెనాల్ కట్ట వద్ద ఆటో ఎక్కింది. నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ విజయ్ ఆ వృద్దురాలిని ఒక నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమె మెడలోని సుమారు 2 తులాల బంగారు గుండ్ల పేరును, ఆమె వద్ద ఉన్న 200 రూపాయలను లాక్కొని పారిపోయాడు. దీంతో ఆ వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి సీసీఎస్ అండ్ 3 టౌన్ పోలీస్ వారు ఆటో డ్రైవర్ విజయ్ గురించి గాలించారు. ఈ మేరకు సోమవారం నమ్మదగిన సమాచారం అందడంతో ఖానాపూర్ నివాసి అయిన విజయ్ ని పట్టుకున్నారు. అనంతరం విచారించగా అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం అతని వద్ద నుంచి దొంగలించిన బంగారు చైన్ స్వాధీనం చేసుకుని, నేరస్తున్ని రిమాండ్ కి పంపించారు.
