23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆటో డ్రైవర్ పై దాడి చేసి దోచిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ నెల 7న బర్సాత్ అమీర్ అనే రౌడిషీటర్ అనుచరులు షారుఖ్ అనే అటో డ్రైవర్ ను దారి కాచి పంచ్ లతో, కత్తులతో దాడి చేసి దోచుకున్నారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్ షారుఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఆటో డ్రైవర్ పై దాడి చేసి  పరారీలో ఉన్న మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలాల్ నగర్ కు చెందిన మహ్మద్ షేక్ వసీం అలియాస్ కాలు దాదా, నగరంలోని నిజాం కాలనీకి చెందిన సయ్యద్ ముదస్సీర్ అలియాస్ మల్లా, సతీష్ నగర్  కు చెందిన షేక్ సుల్తాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

More articles

Latest article