వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పు ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు రూ. కోటి జరిమానా విధించారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్ద పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. ఈతీర్పుతో అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను దోచుకునే యత్నానికి హైకోర్టు చెక్ పెట్టింది. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.