గాంధారి, బతుకమ్మ : ఎలుగుబంటి కనిపించడంతో ఆ దారి గుండా ఆ ప్రాంతం నుండి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని చద్మల్తాండ శివారులోని దట్టమైన అడవి ప్రాంతంలో ఎలుగుబంటి కనిపించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఎలుగుబంటి వీడియోలు వైరల్ గా మారాయి. అయితే గాంధారి నుండి నిజామాబాద్ వెళ్లేందుకు వయా మంచిప్ప మీదుగా బస్సు సౌకర్యం కలదు అయితే దట్టమైన అడవి ప్రాంతం నుండి ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే బైక్ పై వెళ్తున్న వ్యక్తులకు ఎలుగుబంటి కనిపించడంతో వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చర్మల్ తండా గ్రామస్తులు తమ తండా వైపు ఎలుగువంతులు రాకుండా ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


