29 C
Hyderabad
Monday, August 3, 2026

సవాల్ ప్రతి సవాళ్ళతో ప్రజలకు ఒరిగేది ఏమి లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఇల్లు ముట్టడి, దాడులకు పాల్పడితే ఏం సాధించారు
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, విమర్శిస్తూనే ఉంటా
  • ముట్టడిలు, దాడులకు భయపడను
  • పథకాలు అందని వారికి సీఎంతో మాట్లాడి ఇప్పించండని సూచన

 

వేల్పూర్,బతుకమ్మ : ప్రజా ప్రతినిధులు సవాళ్లు విసురుకోవడం, ప్రతి సవాళ్లు చేసుకోవడం మూలన మనల్ని నమ్ముకొన్న ప్రజలకు ఒరిగేది ఏమి లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం తో మానాల మోహన్ రెడ్డి నా ఇంటిని ముట్టడించి, మాపై దాడి చేయడంతో ఆయనకు కడుపునిండిందా అని ప్రశ్నిస్తూ ఈ ముట్టడి, దాడి వాళ్ల నీవే్మీ సాధించావాని మానాలను ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీరు ముట్టడి చేసిన దాడులు చేసిన భయపడేది లేదని ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూనే ఉంటానని అది ప్రతిపక్ష నాయకునిగా నా భాద్యత అన్నారు. నా ఇంటిని ముట్టడించడం వల్లనో ఎవరినో నా ఇంట్లోకి పంపి దాడికి ఉసికొల్పడం వల్లనో ప్రజలకు ఏమి లాభం జరగదని రైతు బందు రాని రైతులకు రైతు బందు, వడ్ల బోనస్ ఇవ్వని వారికి బోనస్, రుణమాఫీ కానివారికి రుణమాఫీ, సిలెండరు సబ్సిడీ రానివారికి సబ్సిడీ ని సీ. ఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఇప్పించాలని మానాలకు సూచించారు. కానిస్టెన్సీలో ఇంకా 12 మంది గల్ఫ్ భాధిత కుటుంబాలకు ఇంకా ఇవ్వాల్సిన సహాయాన్ని, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇస్తామన్నా తులం బంగారం ఇప్పించాలని ఎమ్మెల్యే హితావు పలికారు. నివ్వు, నేను రాజకీయ సన్యాసం తీసుకోవడం వల్లనో, నా ఇంటి ముట్టడి వల్లనో,నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడం వల్లనో ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. ఎవరో వరంగల్ కు చెందిన గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి నా ఇంటి పైకి వచ్చి తన సోదరునిపై దాడి చేయడం సబబు కాదని అన్నారు. నేను మాట్లాడింది గల్ఫ్ కార్మికులకు వ్యతిరేకంగా కాదని, వారికి, వారి కుటుంబాలకు అనుకూలంగా మాట్లాడానని అలాంటప్పుడు గల్ఫ్ సంక్షేమం కోరే ఆయన తనను ప్రశంశించాలసింది పోయి నా ఇంటిపై దాడి చేయడం విడ్డురమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజాస్వామ్యంలో వారి తీరును ప్రజలే గమనిస్తున్నారని, వారే బుద్ది చెబుతారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణమని, ప్రభుత్వం హమీ అమలు చేయకుంటే ప్రతిపక్ష నేతలు నీలాదీయడం సహజమని అన్నారు.

More articles

Latest article