25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలని భిక్కనూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య సూచించారు. సోమవారం మండలంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ బాలయ్య మాట్లాడుతూ నిమ్న జాతుల వారిని ఎవరైనా దూషిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఏఎస్ఐ జగదీశ్, మదన్ లాల్, మాజీ సర్పంచ్ సుమలత, సిపిఎం జిల్లా నాయకులు కొత్త నరసింహులు, గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article