29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ  విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 30న  ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే బిసి విద్యార్థుల సమర శంఖారావం  కరపత్రాలు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, డిగ్రీ  కాలేజ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుస్సా ఆంజనాయులు మాట్లాడుతూ తక్షణమే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న  సుమారుగా  రూ. 4,500 కోట్ల ఫీజు రియాబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఏ విధంగా అయితే స్కాలర్ షిప్ వస్తుందో అదేవిధంగా బీసీ విద్యార్థిలకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలలో సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ తెలిపారు. బీసీలకు ప్రవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు సంఖ్యను పెంచాలన్నారు. హైదరాబాదులో 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి ద్యాగ శేఖర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బీసీ విద్యార్థి నాయకులు  అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంకరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శేఖర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, ధర్శనం దేవేందర్, శ్రీలత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article