25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పెండింగ్ స్కాలర్షిప్ లు వెంటనే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న 8000  కోట్ల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని అఖిలభారతి విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు బీసీ,ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని,విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విశ్వవిద్యాలయాలకు వాటి బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ పెంచకుండా ప్రైవేటు యూనివర్సిటీల వలె విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి దాపురించిందన్నారు.  ఈ  కార్యక్రమంలో విభక్ సోషల్ మీడియా కన్వీనర్  సునీల్, నగర కార్యదర్శి బాలకృష్ణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్, కంటేశ్వర్ జోనల్ ఇన్చార్జ్ దుర్గా దాస్, ఇంద్రసేన,  శ్రీకర్, యోగేష్, సాయినాథ్, రాజు, అభినవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Pending scholarships should be paid immediately.

More articles

Latest article