పెండింగ్ స్కాలర్షిప్ లు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న 8000  కోట్ల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని అఖిలభారతి విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు...