25.4 C
Hyderabad

హత్యయత్నం కేసులో ఒకరికి ఐదేళ్ల కఠిన కారాగారం

Five years of rigorous imprisonment for attempted murder

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

బర్త్ డే పార్టీలో డిజే సౌండ్ ఎక్కకు పెట్టవద్దు అన్నందుకు మనసులో కక్ష పెంచుకుని ఒక వ్యక్తిని కతం చేద్దామనుకుని కత్తితో కడులో పొడిచి హత్యయత్నం చేసిన కేసులో షేక్ గౌస్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.పిపి తెలిపిన వివరాలు నవీపేట్ మండలం ధర్యపూర్ గ్రామ నివాసులైన షేక్ అమన్, షేక్ గౌస్ లు అన్నదమ్ములు అమన్ బర్త్ డే సందర్బంగా ఇంటి బయట  వేడుకలు జరుపుకునే సమయంలో డిజే సౌండ్ ఎక్కువగా పెట్టడం మూలంగా సౌండ్ తో ఇబ్బందిగా ఉన్నదని షేక్ సోహెల్ అనే యువకుడు అభ్యతరం తెలిపి అన్నదమ్ములిద్దరు ఎంతకు పట్టించుకున పోయేసరికి నవీపేట్ పోలీస్ లకు ఫోన్ కాల్ చేయడంతో వారు సంఘటన స్థలంకు వచ్చి డిజే సౌండ్ ను ఆపివేయించడంతో ఇది మనసులో పెట్టుకున్న షేక్ గౌస్ కక్ష పెంచుకుని సోహెల్ ను కతం జెద్దామని నిర్ణయించుకుని 2024 నవంబర్, 18 న అర్ధరాత్రి గ్రామంలో తన స్నేహితులతో మాట్లాడుతున్న గౌస్ పై తాను తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి తీవ్రమైన గాయాలు చేసి హత్యయత్నం చేశాడనే నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువయినట్లు నిర్దారిస్తూ సెషన్స్ జడ్జి తీర్పు చెబుతూ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయలు జరిమానా విదించినట్లు పిపి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారని ఆయన వివరించారు

More articles

Latest article