24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన పెంచాల శ్రీలత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్ట 20వ డివిజన్‌కు చెందిన పెంచాల శ్రీలత శ్రీనివాస్, పెంచాల వేణు, దినేష్ మహేష్ లు మంగళవారం మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కె.ఆర్. సురేష్ రెడ్డి, సురేష్, వి.జి. గౌడ్, యెండాల ప్రదీప్, పార్టీ అర్బన్ అధ్యక్షులు సిర్ప రాజు, ఎన్. కాలి చరణ్, గుడుమల భాను, అరవింద్ లింగాల, బొండ్ల నాగేష్, శంకర్, బాలన్న, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article