29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సమగ్రశిక్ష ఉద్యోగుల శాంతియుత దీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : డిమాండ్ ల సాధన కోసం  తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కేంద్రంలో శాంతియుత రిలే నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి రూ.10లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా, పీటీఐలకు రూ.12నెలల వేతనం, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రూ.20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడంతోపాటు  మరణించి ఉద్యోగుల కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్  విజయ్, ప్రధాన కార్యదర్శి భూపేందర్, తదితరులు పాల్గొన్నారు.

 Peaceful initiation of comprehensive punishment employees

More articles

Latest article